- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ అధికారి దివ్య కుటుంబ నియంత్రణ పై ఉన్న అపోహాలు తొలగిస్తూ సురక్షిత పద్ధతిలో నో స్కాపల్ వెసక్టమని అన్నారు. ఆడవాళ్లు చేసుకోవడం వల్ల సమస్యలు ఎక్కువ వస్తున్నాయని పిల్లలు పుట్టకుండా మగవాళ్ళు చేసుకోవడం వల్ల సురక్షితంగా ఉంటుందన్నారు. ఈనెల 21వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఇ వో వెంకటరమణ, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
- Advertisement -



