Monday, November 24, 2025
E-PAPER
Homeక్రైమ్ప్రమాదవశాత్తు బస్సు కింద పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు బస్సు కింద పడి వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
ప్రమాదవశాత్తు బస్సు కిందపడి వ్యక్తి మరణించిన సంఘటన మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అదిలాబాద్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు మమత, స్వామి అదిలాబాద్ వెళ్లడానికి హైదరాబాదులో బస్సు ఎక్కినారు. జంగంపల్లి గ్రామ శివారికి చేరుకోగానే భర్త స్వామికి వాంటింగ్స్ అవుతున్నాయని బస్సు డ్రైవర్ కు తెలియజేయడంతో బస్సు డ్రైవర్ ఎలాంటి సూచనలు చేయకుండా డోర్ తీయగా ప్రమాదవశాత్తు స్వామి బస్సులో నుండి కింద పడిపోయాడు. స్వామి పైనుండి బస్సు వెనకాల టైరు వెళ్లగా అక్కడికక్కడ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -