నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి తహసిల్దార్ గా కలెక్టర్ కార్యాలయంలో సూపరిండెంట్ గా పనిచేస్తున్న సూత్రం సరస్వతిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారం తహసిల్దారుగా సరస్వతి బాధ్యతలను స్వీకరించారు. ఇన్చార్జి తహసీల్దారుగా 24 రోజులు విధులు నిర్వహించిన మంతాపురం శ్రీధర్ సూపరిండెంట్ గా కలెక్టర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ సాదా బైనామాల సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తానని తెలిపారు. సాదా బైనమాల సమస్యల పరిష్కారం కోసం మండలంలోని ప్రజలు సహకరించాలని సూచించారు. మండలంలో నెలకొని ఉన్న రెవిన్యూ సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. తహసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన సరస్వతిని డీటీతోపాటు ఎలక్షన్ డ్యూటీ, ఆర్ ఐ లు, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
పాలకుర్తి తహసిల్దార్ గా సరస్వతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



