నవతెలంగాణ-పాలకుర్తి
దాతల సహకారంతో శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఘాట్ రోడ్డుపై ఐదు లక్షల వ్యయంతో రేకుల షెడ్డు నిర్మాణ పనులు చేపట్టామని ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామానికి చెందిన వంగ సోమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఘాట్ రోడ్డు మార్గంలో ఐదు లక్షలతో రేకుల షెడ్డు నిర్మాణానికి ముందుకు రావడంతో సోమవారం దాతలు పనులను ప్రారంభించారని తెలిపారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఆలయ సందర్శనతోపాటు దర్శనానికి వచ్చే భక్తులు ఘాట్ రోడ్డు మార్గంలో ఎండను తట్టుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం రేకుల షెడ్డును ఏర్పాటు చేయాలని సంకల్పంతో ముందుకు వచ్చామని తెలిపారు. రేకుల షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలను ఈవో లక్ష్మీ ప్రసన్న అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
దాతల సహకారంతో ఘాట్ రోడ్డుపై రేకుల షెడ్డు నిర్మాణ పనులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



