నవతెలంగాణ – దుబ్బాక
హార్వెస్టర్ (వరికోత) మిషన్ కి రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన దుబ్బాక పట్టణ కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామానికి చెందిన సీహెచ్ చంద్రంకు వరికోత మిషన్ ఉంది. దీన్ని మరమ్మత్తులు చేయించేందుకు దుబ్బాకలోని ఓ వెల్డింగ్ షాపుకు తీసుకొచ్చాడు. రిపేర్ చేస్తుండగా హార్వెస్టర్ లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం అందించగా.. దుబ్బాక ఫైర్ స్టేషన్ ఆఫీసర్ కమలాకర్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. కాగా ఈ ప్రమాదంతో తనకు రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు చంద్రం ఆవేదన వ్యక్తం చేశారు.
దుబ్బాకలో హార్వెస్టర్ దగ్ధం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



