Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కరాటే కిక్స్ విభాగంలో దుబ్బాక విద్యార్థుల సత్తా..

కరాటే కిక్స్ విభాగంలో దుబ్బాక విద్యార్థుల సత్తా..

- Advertisement -

లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు
నవతెలంగాణ – దుబ్బాక 

కరాటే కిక్ చాలెంజ్ లో దుబ్బాక విద్యార్థులు సత్తా చాటి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ‘ విజన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కిక్ ఛాలెంజ్’ లో.. 1200 మంది పాల్గొనగా దుబ్బాకకు చెందిన విద్యార్థులు లక్షిక, లోకేష్, నిశాల్, హర్షవర్ధన్, శ్రీహన్స్ లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తూ.. యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా 8,56,400 కిక్స్ నమోదు చేసి గత రికార్డు (7, 86000)ను బద్దలు కొట్టడం జరిగిందని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -