Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటింటికీ ఇందిరమ్మ చీరల పంపిణీ..

ఇంటింటికీ ఇందిరమ్మ చీరల పంపిణీ..

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సదానందం..
నవతెలంగాణ – టేకుమట్ల 

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇంటింటికి ఇందిరమ్మ చీరలను అందించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం అన్నారు. ఇందిరమ్మ చీరలను ఆదివారం భూపాలపల్లి శాసనసభ్యులు  గండ్ర సత్యనారాయణరావు మండల కేంద్రంలోప్రారంభించగా సోమవారం మండలంలోని  గ్రామాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దాసరపు సదానందం గర్మిళ్లపల్లి  గ్రామంలో  శివ కేశవ గ్రామ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ..మండలంలోని ప్రతి ఇంటికి ఇందిరమ్మ చీరను అందిస్తామని, ప్రస్తుతం మహిళా సంఘ సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని, అనంతరం తెల్ల రేషన్ కార్డు ఉన్న  18 సంవత్సరలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను అందిస్తామని సదానందం అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దిలీప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఏనుగు తిరుమల లచ్చిరెడ్డి, చేనేత విభాగము జిల్లా అధ్యక్షులు ఆడేపు సంపత్, మద్దెల కుమార్,సిఏ సింగిరెడ్డి స్వాతి, బొజ్జపల్లి తిరుపతి  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -