నవతెలంగాణ – దుబ్బాక
ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని కోరుతూ మున్సిపల్ పరిధిలోని లచ్చపేట వార్డుకు చెందిన మామిడాల రాజు అనే యువకుడు సోమవారం దుబ్బాకలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అన్ని విధాలైన అర్హుడైన తనకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హౌసింగ్, మున్సిపల్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లోను ఆర్జీ పెట్టుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్ ను వివరణ కోరగా.. బాధితుని విజ్ఞప్తిని హౌసింగ్ పీడీ, జిల్లా కలెక్టర్లకు నివేదించడం జరిగిందన్నారు. కలెక్టర్ హైమావతి యువకుడు రాజు తో ఫోన్లో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని యువకుడి నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



