నవతెలంగాణ – కట్టంగూర్
108 వాహనంలో మహిళా ప్రసవం జరిగిన సంఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. సంఘటన సంబంధించి వాహన సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఐటిపాముల గ్రామానికి చెందిన చింత సునంద (నిండు గర్భిణి) ఆదివారం రాత్రి కురుమర్తి గ్రామంలో జరిగిన ఫంక్షన్ లో పాల్గొనేందుకు వచ్చింది. రాత్రి అదే గ్రామంలో ఉండగా ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి ఫోన్ చేశారు. ఆమెను కారులో కురుమర్తి నుంచి కట్టంగూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో 108 వాహనం కారును చేరుకోగా ఆమెను వాహనంలోకి ఎక్కించారు. నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ అవడంతో 108 వాహనం ఎమర్జెన్సీ టెక్నీషియన్ బసవోజు శ్రీను ఆమెకు డెలివరీ చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లిని, బిడ్డను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
108 వాహనంలో మహిళ ప్రసవం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



