Saturday, May 17, 2025
Homeట్రెండింగ్ న్యూస్కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహిళలే దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లో వీహబ్‌ వుమెన్‌ యాక్సిలరేషన్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడి స్టాళ్లను పరిశీలించి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేది లక్ష్యం. తెలంగాణ 1 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలంటే ఇది జరగాలి. ఈ నెల 21న ఇందిరా మహిళ స్టాళ్లను మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. కార్పొరేట్‌ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకొని దేశం విడిచి పారిపోతున్నారు.  మహిళలకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నారు’’ అని తెలిపారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -