నవతెలంగాణ – గాంధారి
జాతీయ బాక్సింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ లోని అలీపూర్ లోని ఎస్ ఎం బాక్సింగ్ క్లబ్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అర్జున్ గజానంద్ దేశముఖ్ 65 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించినట్లు మాజీ జెడ్పీటీసీ తానాజీ రావు వాలీబాల్ కోచ్ లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. 8వ జాతీయ స్థాయి యూత్ పోటీలు నవంబర్ 21 నుండి 24 వరకు జరిగాయి. ఫైనల్ లో ఉత్తరాఖండ్ క్రీడాకారిడితో పోటీపడి ద్వితీయ స్థానం సాధించారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల అర్చన బాక్సింగ్ క్లబ్ లో కోచి సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పథకం తేవడమే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ స్థాయి లో పథకం సాధించిన అర్జున్ కు కళాశాల అధ్యాపక బృందం, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలో గాంధారి కుర్రాడికి వెండి పథకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



