– మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు..
నవతెలంగాణ – తొగుట
తుక్కాపూర్ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం మండలంలోని తుక్కా పూర్ గ్రామంలో పోచమ్మ దేవాలం ప్రహరీ నిర్మమానం, పెద్దమ్మ దేవాలం ప్రాంగణంలో పంక్షన్ హల్ నిర్మా ణం భూమి పూజ చేశారు. గతం దుబ్బాక ఎమ్మె ల్యేగా ఉన్న సమయం లొ ఎస్సి కమ్యూనిటీ భవ నం పూర్తి చేసేందుకు రూ.10 లక్షలు నిధులు అందించారు. భవనం పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవం చేశారు. అనంత రం అయన తుక్కాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసేం దుకు సహకారం అందిస్తామన్నారు.
గతంలో ఎమ్మె ల్యేగా ఉన్న ప్రస్తుతం ఎంపీగా ఉన్న గ్రామానికి సహకరిస్తామన్నారు. మల్లన్న సాగర్ పుణ్యమా అని మీ గ్రామానికి పనులు లేక అవస్థలు పడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చాలా వరకు అందిరికి స్లాబ్ భవనాలు ఉన్నం దున సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ పథకం ద్వారా రూ. 70 వేలు అందిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ప్రవేశ పెట్టిన ప్రత్యేక పథకం విద్యుత్ కోసం సోలార్ ప్లేట్లను అమర్చుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి రోజు రెండు యూనిట్ల విద్యుత్ అందుతుం దని అన్నారు. మీకు అవకాశం ఉంటే ఇంటి వెను కాల కాళీ స్థలంలో సోలార్ ప్లేట్లు అమర్చుకుంటే మీరు విద్యుత్ వాడుకోగా మిగులు విద్యుత్ అమ్ముకొంటే ఆర్థికంగా మీకు చేయూత ఉంటుం దని వివరించారు. సోలార్ కోసం ఒక అధికారిని పంపిస్తానని మీరు ఈ పథకం ఉపయోగించుకోవా లని తెలిపారు.



