గుండాల అంబేద్కర్ విగ్రహావిష్కరణలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..
నవతెలంగాణ – వెల్దండ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు నడుంబించి ముందుకు రావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం వెల్దండ మండల పరిధిలోని గుండాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటుచేసి అంబేద్కర్ ఆశయ సాధన ను గుర్తు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుల తో పాటు, గ్రామ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలకు నడుం బిగిద్దాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


