నవతెలంగాణ – సదాశివ నగర్
సదాశివ నగర్ మండలం మోడెగాం గ్రామంలోని లబ్ధిదారులు మొహమ్మద్ తస్లీమ్, ముంతాజ్ రజిని కుటుంబాలకు మంజూరైన ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో, రేకుల ఇల్లు, జీవనం సాగిస్తున్న తమ కుటుంబానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి వల్ల ఇంద్రమ్మ ఇల్లు మంజూరైందని అన్నారు. ఈ సహాయం తమ కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు. తమకు ఇల్లు మంజూరు చేసినందుకు జీవితాంతం ఎమ్మెల్యే మదన్ మోహన్ కు, సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. ఇల్లు లేని ప్రతి అర్హ లబ్ధిదారుడికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయడం నా కల. మన నియోజకవర్గానికి మొత్తం 3500 ఇళ్లు మంజూరయ్యాయి. వేగంగా పనులు పూర్తి చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఇతర ప్రభుత్వ అధికారుల కృషిని ఆయన అభినందించారు.
ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


