నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశములో డీమాట్ ఖాతాల సంఖ్య 20-కోట్ల మార్కు దాటింది. హైదరాబాదు సమీప నగరాల నేతృత్వములో తెలంగాణాలో పెట్టుబడిదారుడి భాగస్వామ్యం గణనీయమైన వృద్ధిని చూపుతోంది. దేశము యొక్క ఆర్ధిక మార్కెట్ లో రాష్ట్రము ఇప్పుడు 8.4% గా ఉంది.
జూన్ 2025 నాటికి భారతదేశపు మొత్తం డీమాట్ ఖాతాలలో తెలంగాణలోని పెట్టుబడిదారులు 6.09%, మ్యూచువల్ ఫండ్ ఆస్తులలో 1.7% గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 12 కోట్ల ప్రత్యేకమైన పెట్టుబడిదారులతో, తెలంగాణా యొక్క వాటా ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ లో స్థిరమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పెరుగుదల నగర పెట్టుబడిదారులు, చిన్న పట్టణాలలో పెరిగిన ఆర్ధిక అవగాహన ద్వారా నడుపబడుతోంది.
క్యాపిటల్ మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టడానికి నిర్దేశిత పెట్టుబడిదారుల నిరక్షరాస్యత ప్రధాన ప్రతిబంధకం అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ద్వారా నిర్వహించబడిన 2025 పెట్టుబడిదారుల సర్వే వెల్లడిస్తుంది. సర్వేలో పాల్గొన్న 53,357 మందిలో, 1 శాతము కంటే తక్కువమంది క్యాపిటల్ మార్కెట్స్ పై విద్యా కార్యక్రమాలకు హాజరు అయ్యారు. సర్వేలో పాల్గొన్న చాలామంది సెక్యూరిటీస్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది అనేదానిపై అవగాహన లేదని, పెట్టుబడి పెట్టడం ఎలా ప్రారంభించాలో తెలియదని చెప్పారు.
పరిజ్ఞానాన్ని అందించడము ద్వారా పెట్టుబడిదారు బేస్ ను పెంచుటకు ఖాళీని పూరించవచ్చు. ఇక్కడే అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమి (ASTA) రంగంలోకి వస్తుంది. శిక్షణ పొందిన మరియు సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి సన్నద్ధం అయిన 60,000 మంది విద్యార్థులతో, అకాడమి ప్రతిరోజు తన ఉనికిని పెంచుకుంటోంది.
తెలంగాణాలో, ఎంతోమంది సాధారణ వ్యక్తులకు, సంభావ్య పెట్టుబడిదారులకు, ప్రస్తుత పెట్టుబడిదారులకు ఈ శిక్షణా కార్యక్రమాలు ముఖ్యమైన మార్పు తెచ్చేవిగా నిరూపితమయ్యాయి. ఈ కార్యక్రమాలు వాణిజ్యము యొక్క సాంకేతిక అంశాలను వివరించడమే కాకుండా, వ్యూహాల మాదిరిగానే ముఖ్యమైన నైపుణ్యాలైన క్రమశిక్షణ, సహనం, భావోద్వేగ నియంత్రణలను కూడా వివరిస్తాయి.
2024లో ఈ శిక్షణా కార్యక్రమములో చేరిన సలీం ఖాన్ కథనం తీసుకుందాము. ఈ కార్యక్రమము తన ధోరణిని పూర్తిగా మార్చాయని ఆయన చెప్పారు: “శిక్షణా కార్యక్రమానికి ముందు, వాణిజ్యాన్ని నేను ఒక సాంకేతిక వృత్తిగానే చూశాను. ఇది మానసిక వైఖరి, క్రమశిక్షణ గురించి అని నేను అర్థంచేసుకున్నాను. నేను ముందుగానే సిద్ధం అవుతాను, నా వ్యాపారాలను క్రమబద్ధంగా ప్రణాళిక చేసుకుంటాను. భావోద్వేగాలు జోక్యం చేసుకోకుండా చూసుకుంటాను.”
ఈ కార్యక్రమము యొక్క బలము దాని సమాజం, నిర్మాణంలో ఉంది అని జశ్విని దాడిగ భావించారు. లైవ్ సెషన్స్, అసైన్మెంట్స్ మరియు పీర్ చర్చలు ఎలా ఆమెను నిమగ్నం చేశాయి. జవాబుదారిగా ఉంచాయి అనేది ఆమె గుర్తుచేసుకున్నారు. “ఇది మీరు నిరంతరం అభివృద్ధి చెందేలా చేస్తుంది. సంస్థలో అందించబడే మార్గదర్శనం, జీవితాన్ని-మార్చేదిగా ఉంటుంది. అది నా ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచింది,” అని ఆమె అన్నారు.
సోషల్ మీడియా వీడియోల నుండి లైవ్ సెషన్స్, మార్గదర్శనం వరకు, ఈనాటి పెట్టుబడిదారు విద్యా కార్యక్రమాలు వివిధ వయసుల వాళ్ళకు, అభ్యాస ప్రాధాన్యతలకు అనుకూలంగా ఉండే విధంగా తయారుచేయబడాయి. భాగస్వామ్యం పెరుగుతున్న తెలంగాణాకు, ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు సంపద మరియు ఆర్ధిక స్థిరత్వాన్ని ఏర్పరచుకొనుటకు సిద్ధంగా ఉన్న నమ్మకం, క్రమశిక్షణ కలిగిన పెట్టుబడిదారులు ఉన్న కొత్త తరానికి నాంది పలుకుతాయి.



