ప్రస్తుతం గుండె సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు వయసు పెరిగిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండని వారిలో కనిపిస్తున్నాయి. గుండె సంబంధిత సమస్యల ద్వారా అకాల మరణం పొందుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. అయితే చాలా వరకు గుండె సమస్యలకు మారుతున్న జీవినశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడంతో పాటు వ్యాయామం తగ్గడం వంటి కారణాలు వల్ల గుండె పోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ జీవితంలో మార్పులు చేసుకుంటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే..
8 ఫిజికల్ యాక్టివిటీ : ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్‌నెస్ కాపాడుకోవాలి. యాక్టివ్‌గా నడవడం, యోగా లేదా లైట్ రన్నింగ్ వంటివి చేయాలి. బాడీని ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంచితే, శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది. దీంతో హార్ట్ పంపింగ్ కెపాసిటీ పెరిగి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజూ 30 నిమిషాలైనా సింపుల్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో బరువు కూడా అదుపులో ఉంటుంది. వాకింగ్, ఇతర వ్యాయామాలు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.
ఫాస్ట్ ఫుడ్ వద్దు : హార్ట్ ఎటాక్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం, మన ఆహారపు అలవాట్లు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. వీటిలో ఆయిల్, షుగర్స్, సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
స్ట్రెస్ మేనేజ్‌మెంట్ స్ట్రెస్ ఫిజికల్, మెంటల్ హెల్త్‌కు చాలా డేంజర్. ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతుంటే.. ఇది మీ గుండెపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. రోజూ 15 నిమిషాల మెడిటేషన్ లేదా శ్వాస వ్యాయామాలు స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే, గుండె పనితీరు కూడా బాగుంటుంది. దీంతో హార్ట్ ఎటాక్, ఇతర గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
నిద్ర : నిద్రలేమి అనేక రకాల అనారోగ్యాలకు కారణం. రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర సరిపోకపోతే హార్ట్ రేటు, బీపీ, స్ట్రెస్ లెవల్స్ పెరుగుతాయి. రోజూ ఒకే టైమ్‌కి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. మంచి నిద్ర మీ గుండెను రీఛార్జ్ చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి..
- Advertisement -
- Advertisement -



