Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌లో నారాయణ గ్రూప్‌ 'ది వన్‌ స్కూల్‌ ' ప్రారంభం

హైదరాబాద్‌లో నారాయణ గ్రూప్‌ ‘ది వన్‌ స్కూల్‌ ‘ ప్రారంభం

- Advertisement -

– 21వ శతాబ్ద విద్యకు కొత్త దశ, దిశ
– చూపేందుకు నారాయణ నూతన ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆసియాలోనే అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన నారాయణ గ్రూప్‌, తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన మరో నూతన విద్యాసంస్థ ‘ది వన్‌ స్కూల్‌’ ప్రారంభాన్ని హైదరాబాద్‌లో ఘనంగా ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్కూల్‌ ఆధునిక, సమగ్ర విద్యా విధానాలతో విద్యార్థులను ప్రపంచ స్థాయి నాయకులుగా మార్చబోతోంది. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో వారిని భావి విజేతలుగా మలిచేందుకు అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. నారాయణ ది వన్‌ స్కూల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నారాయణ విద్యా సంస్థల మేన్ఱేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సింధూర నారాయణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించడం మాత్రమే చాలదని అభిప్రాయపడ్డారు. అంతకుమించి విమర్శనాత్మక ఆలోచన, వ్యక్తిత్వ వికాసం, సామాజిక జీవన నైపుణ్యాలు అవసరమని తెలిపారు. ఆ అవసరాలను తీర్చడమే లక్ష్యం ‘ది వన్‌ స్కూల్‌’ని రూపొందించామని చెప్పారు. ఈ స్కూల్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా ప్రమాణాలను అందించనున్నట్టు వెల్లడించారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు, బాధ్యతాయుతమైన ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన మొదటి ప్రపంచ స్థాయి క్యాంపస్‌ సేవలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ పాఠశాల ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) కరిక్యులమ్‌ అనుసరిస్తుందని వివరించారు. ప్రస్తుతం ఫౌండింగ్‌ బ్యాచ్‌ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. అభ్యాసానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పే ఈ ప్రాజెక్టులో హైదరాబాదీలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ‘అన్‌లాకింగ్‌ ది వన్‌ వితిన్‌’ అనే సిద్ధాంతంపై ముందుకు ముందుకు సాగుతున్న ఈ పాఠశాల, విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి కట్టుబడి ఉందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -