Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీనోమ్‌వ్యాలీ భవిష్యత్‌ను నిర్దేశిస్తాం

జీనోమ్‌వ్యాలీ భవిష్యత్‌ను నిర్దేశిస్తాం

- Advertisement -

– 1 బయోతో అభివృద్ధి మరింత వేగవంతం : సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

అంతర్జాతీయస్థాయిలో వచ్చే 25 ఏండ్లకు జీనోమ్‌వ్యాలీ భవిష్యత్‌ను తమ ప్రభుత్వం నిర్దేశిస్తుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జీనోమ్‌వ్యాలీ 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బయోలాజిక్స్‌ విస్తరణ అవకాశాలను మెరుగుపరుస్తామనీ, దానికోసం 1 బయోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశానికి జీనోమ్‌వ్యాలీ మార్గదర్శకంగా సేవలు అందిస్తున్నదని ప్రసంసించారు. 1 బయో సౌకర్యంతో ప్రపంచవ్యాప్తంగా నూతన ఆవిష్కరణలు ఎక్కడ జరిగినా హైదరాబాద్‌లో పైలట్‌ మరియు క్లినికల్‌ దశలకు వేగంగా, తక్కువ ఖర్చుతో పురోగమి స్తాయని వివరించారు. జీనోమ్‌ వ్యాలీకి కొత్త గుర్తింపు, గేట్‌వే నిర్మాణం, మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం రూ.200 కోట్లు కేటాయిం చామన్నారు. లైఫ్‌ సైన్సెస్‌లో ప్రపంచ నాయకత్వ తదుపరి దశ వృద్ధికి జీనోమ్‌వ్యాలీ క్లస్టర్‌ను సిద్ధం చేస్తున్నామని వివరించారు. అంతకు ముందు ఆయన జీనోమ్‌వ్యాలీ కొత్త లోగోను ఆవిష్కరించారు. బీ హబ్‌ను ప్రారంభిం చారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సంజ రుకుమార్‌ మాట్లా డుతూ భారతదేశ ఫార్మా ఉత్పత్తిలో 40 శాతం, ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడవ వంతు వాటాను తెలంగాణ రాష్ట్రం కలిగి ఉందని చెప్పారు. తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ ఫౌండేషన్‌ సీఈఓ శక్తి ఎం. నాగప్పన్‌ మాట్లాడుతూ లైఫ్‌ సైసెన్స్‌తో పాటు బయోలాజిక్స్‌ పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆఫ్రికా థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ఆసియా పసిఫిక్‌ అండ్‌ మిడిల్‌ ఈస్ట్‌ ప్రెసిడెంట్‌ టోనీ అక్సియారిటో మాట్లాడుతూ పరిశోధనలు, పరిశ్రమ భాగస్వామ్యాలకు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనాథ్‌ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -