Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరానున్న కాలంలో కార్పొరేటర్లకు మంచి భవిష్యత్తు

రానున్న కాలంలో కార్పొరేటర్లకు మంచి భవిష్యత్తు

- Advertisement -

– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో కార్పొరేటర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పి సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లపాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారని చెప్పారు. ముఖ్యంగా రెండోసారి జీహెచ్‌ఎంసీలో గెలిచిన తర్వాత కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ ప్రజలకు అద్భుతమైన సేవలను అందించారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నారని వివరించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా పోరాడారనీ, వారికి అభినందనలు చెప్పారు. పార్టీ వెంటే నిలబడిన ప్రతి కార్పొరేటర్‌కి భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకుని అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -