Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'అంగన్‌వాడీ' రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలి

‘అంగన్‌వాడీ’ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలి

- Advertisement -

– ఆదిలాబాద్‌లో 25న భారీ బహిరంగ సభ, ర్యాలీ
– అంగన్‌వాడీలు పెద్దఎత్తున తరలి రావాలి : తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతతినిధి

తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం ఆదిలా బాద్‌ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్‌లో 25, 26 తేదీల్లో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రధానం గా అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని, వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిం చుకునేందుకు చేపట్టబోయే పోరాటాలకు మహాసభ లో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర మహాసభకు సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, అఖిల భారత అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ కార్యదర్శి ఏఆర్‌ సింధు, జాతీయ ఉపాధ్యక్షులు వరలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, టీఏజీఎస్‌ ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్‌ హాజరు కానున్నట్టు తెలిపారు. మొదటి రోజు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ నుంచి ఉదయం 11 గంటలకు భారీ ర్యాలీ ప్రారంభమవుతుంద న్నారు. అంబేద్కర్‌ చౌక్‌ మీదుగా నేతాజీ చౌక్‌, న్యూ బస్టాండ్‌, తెలంగాణ చౌక్‌ మీదుగా బహిరంగ సభ నిర్వహించే ఆర్‌అండ్‌బీ అతిథి గృహ మైదానానికి చేరుకుంటుందని వివరించారు. 26న బుధవారం మావల మండలంలోని తిరుమల క్లాసిక్‌ గార్డెన్‌లో ప్రతినిధుల సభ ఉంటుందని, 500 మంది పాల్గొం టారని చెప్పారు. ఐసీడీఎస్‌ పరిరక్షణ, అంగన్‌వాడీ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు, పలు తీర్మానాలు చేయబోతున్నామని తెలిపారు. మహాసభకు అంగ న్వాడీలు పెద్దఎత్తున హాజరై విజయవతం చేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్‌, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు వెంకట మ్మ, నాయకులు మంజుల, ప్రభావతి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -