Tuesday, November 25, 2025
E-PAPER
Homeజిల్లాలుపాత్రికేయ క్రీడాకారులకు టీ షర్ట్స్ పంపిణీ 

పాత్రికేయ క్రీడాకారులకు టీ షర్ట్స్ పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ గోవిందరావుపేట 

మండలంలోని పాత్రికేయ క్రీడాకారులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల  అశోక్ టీషర్ట్స్ పంపిణీ చేశారు. మంగళవారం మండలంలోని చల్వాయి గ్రామంలో అశోకు స్వగృహంలో మీడియా మిత్రులకు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ పాత్రికేయులు క్రీడలలో కూడా రాణిస్తూ ప్రతిభ కనబరచాలని అన్నారు. ఎప్పుడు వార్తలు సమస్యలు పరిష్కారం అధికారులు రాజకీయాల లో బిజీగా ఉండే పాత్రికేయులు రిలాక్స్ కోసం క్రీడలు ఆడాలని సూచించారు. మానసికోలాసం ప్రతి ఒక్కరికి అవసరమని అప్పుడప్పుడు కాసేపు ఆటలు ఆడడం ఆరోగ్యానికి మంచిదని సలహా ఇచ్చారు. జిల్లా స్థాయిలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ పోటీలలో మండల జట్టు ప్రథమ స్థానంలో రావాలని స్థానికుడిగా ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -