సెర్చ్ ప్రొఫైల్ యాప్ లో సాంకేతిక సమస్య
నవతెలంగాణ-మల్హర్ రావు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీకి ‘సర్వర్’ అడ్డంకిగా మారింది. సోమవారం మండల వ్యాప్తంగా గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది. అయితే ఐకేపీ వీవోఏల మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్న ‘సెర్స్ ప్రొఫైల్’ యాప్ సక్రమంగా పని చేయడం లేదు. అందరూ ఒకేసారి యాప్ను వినియోగించడం కారణంగా సర్వర్ మొరాయిస్తోంది. మహిళల ఫొటోలను దించి యాప్లో లో నమోదు చేసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఒక్కో మహిళకు పది, పదిహేను నిమిషాల సమయం పడుతుండడంతో గ్రామాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో మహిళలు పంపిణీ కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది.మండలంలో మొత్తం 693 సంఘాలు ఉండగా అందులో 7,060 ఎస్హెచ్ జి సభ్యులున్నారు.మండలాలనికి 7,011 చీరలు రాగా ఇప్పటికి 3,015 చీరలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.మరో రెండు రోజుల్లో పంచాయతీ ఎన్నికల కోడ్ కూయనున్న నేపథ్యంలో చీరల పంపిణీలో వేగం పెంచారు.



