- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ చిన్నారుల ఎదుట అశ్లీల నృత్యాలు చేయడంపై జిల్లా ఎస్సీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డు అజయ్ కుమార్ అసభ్యకర నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతన్ని విధుల నుంచి తప్పించారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడంపై జిల్లా ఎస్పీ మండిపడ్డారు. హోంగార్డు నృత్యాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. పోలీస్ సిబ్బంది ప్రవర్తన పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంచేలా ఉంచాలని, అప్రతిష్ఠకు గురి చేసేలా ఎవరు వ్యవహరించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- Advertisement -



