Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి

వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను కల్వకుర్తి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మంగళవారం కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. కల్వకుర్తి వెల్దండ మండలాలకు ఒక కోటి 27 లక్షల చెక్కులు స్వయం సహాయక సంఘాలకు అందజేశారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్వకుర్తి వెల్దండ మండలాల 1186 సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించి మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల మహిళల్లో ఒక నమ్మకం, ధైర్యం వచ్చిందన్నారు. ఆయా మండల కేంద్రాల్లో పనిచేసే ఏపియం గ్రామాల్లో ఉండే మహిళ సంఘాలకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను వివరించి వారికి అందే విధంగా మీరు పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి అనంత్ కుమార్, వెల్దండ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, ఎమ్మార్వో ఇబ్రహీం, ఎంపీడీవో వెంకట్ రాములు, డిపిఎం శ్రీనివాస్ ఏపిఎం చంద్రయ్య శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -