– ఎన్ఆర్ఈజీఎస్ లో రూ.35 లక్షల నిధుల మంజూరు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో ఆమెను ఉపాధి హామీ పథకం నిధులు రూ.35 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు మంగళవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కమ్మర్ పల్లి సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ముఖ్య అతిథులుగా పాల్గొని సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి మాట్లాడుతూ మండల కేంద్రంలో ఈజీఎస్ నిధులతో మండల విద్యా వనరుల కేంద్రం రోడ్డుకు రూ.10 లక్షలు, ఉప్లూర్ రోడ్డు నుండి గౌడ సంఘం రోడ్డు వరకు రూ.10 లక్షలు, గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం రోడ్డుకు రూ.5 లక్షలు, స్మశాన వాటిక రోడ్డుకు రూ.5 లక్షలు, గొల్లపేట కాలనీలో రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
గ్రామంలో సిమెంట్ రోడ్ల పనులకు నిధులు మంజూరు చేసిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజక వర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి లకు గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్, నాయకులు సింగిరెడ్డి శేఖర్, కౌడ శైలేందర్, వేములవాడ జగదీష్, అల్గోట్ రంజిత్, దులూర్ కిషన్ గౌడ్, సంపంగి నాగరాజు, పడాల గంగాధర్, ఎడ్ల దీపక్ సాయి, శివసారం నరేష్, సుంకరి గంగాధర్, ముత్యాల చంద్రకాంత్ రెడ్డి, పాలెపు చిన్న గంగారాం, అజహర్, తదితరులు పాల్గొన్నారు.



