Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్నవరం తైబందీని వెంటనే ప్రకటించాలి

లక్నవరం తైబందీని వెంటనే ప్రకటించాలి

- Advertisement -

తుమ్మల వెంకటరెడ్డి తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

మండలంలోని లక్నవరం చెరువు రభి తైబందీని అధికారులు వెంటనే ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో తీగల ఆదిరెడ్డి అధ్యక్షతన తెలంగాణ రైతు సంఘం మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు.

 లక్నవరం చెరువు కింద తైబందిని వెంటనే ప్రకటించాలని ఈ సంవత్సరము లక్నవరం చెరువు కింద అధిక వర్షాలతో పంట దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయని ఎకరాకు 20 బస్తాలు కూడా అంటే 14, నుండి15 కింటాలు రావడంలేదని పేర్కొన్నారు. గత సంవత్సరం రబీలో వడగండ్ల వాళ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.ఇప్పటికే చెరువులో నీరు 33 ఫీట్లు నీరు నిల్వ ఉన్నాయి.

ఈ సంవత్సరము సుమారు 6,500 ఎకరాల దాకా ఇచ్చే అవకాశం ఉన్నది. తైబంది ముందుగా ప్రకటిస్తే రైతులు అందుకు అనుగుణంగా రబీ సీజన్లో రైతులు పనులకు సిద్ధమవుతారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే లక్నవరం టైబంది వెంటనేప్రకటించాలని రంగాపురం, కోట, శ్రీరామ్ పతి కాలువల పూర్తి ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుండు రామస్వామి కాపకోటేశ్వరరావు సామ శ్రీనివాస్ రెడ్డి ఖ్యాతం  సూర్యనారాయణ బానోతు మంక్తియా నాయక్ కన్నోజు  సదానందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -