Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్..

అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గ్రామంలో ఉన్న పిల్లలందరూ అంగన్వాడికి వచ్చేలా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంగన్వాడీ టీచర్ కు సూచించారు. మంగళవారం భువనగిరి మండలం కూనూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ  చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ అంగన్వాడీలో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారని అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో ఉన్న ప్రతి పిల్లవాడు అంగన్వాడీ కి వచ్చేలా చూడాలని అంగన్వాడీ టీచర్ కి సూచించారు. అంగన్వాడిలో ఉన్న పిల్లలతో మాట్లాడుతూ పిల్లలు పేర్లు అడిగి తెలుసుకొని, వాళ్ళు చెప్పిన పద్యాలు విని చాలా మంచిగా చెపుతున్నారని పిల్లలకు బిస్కట్స్ అందజేశారు. ప్రతిరోజు పిల్లలకు , గర్భిణి స్త్రీలకు పెట్టే ఆహారాన్ని పరిశీలించారు.అంగన్వాడీలో బరువు తక్కువ ఉన్న పిల్లల  బరువు పరిశీలించి వారికి బాలామృతం ప్లస్ ఇస్తున్నారా అడిగి తెలుసుకున్నారు. మంచి పౌష్టిక, న్యూట్రిషన్  ఆహారాన్ని  అందించాలన్నారు. గర్భిణి స్త్రీలు  రోజు అంగన్వాడీ కి వచ్చి పాలు గుడ్లు తీసుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు.

పిల్లలకు మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తున్న అంగన్వాడీ టీచర్ ను జిల్లా కలెక్టర్ సన్మానించారు. అనంతరం భువనగిరి మండలం కూనూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మధ్యాన్న భోజనం పథకం కింద విద్యార్థులకి అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం ఈరోజు పెట్టే ఆహారం  నాణ్యతతో పెట్టాలన్నారు. పాఠశాల ఆవరణలో  మురుగు నీటితో కొంచెం బురదగా ఉన్నందున మట్టి పోసి చదును చేయాలని  సంబంధిత పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యక్రమంలో సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -