- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
రాష్ట్రస్థాయి వాలిబాల్ పోటీలకు కలిగొట్ విద్యార్థులు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. ఎస్ జి ఎఫ్ అండర్ /14 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మండలొని కలిగోట్ విద్యార్థులు నిత్యశ్రీ, రోహిత్ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమాచారి వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 26 తేదీ నుంచి 28 తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -



