Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముగ్గుపోసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన ఎంపీడీఓ

ముగ్గుపోసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మైబాపూర్ గ్రామంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శితో కలిసి ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను ముగ్గు వేసి నిర్మాణాల పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారుల సమస్యలు ఏవైనా ఉంటే తమతో నేరుగా తెలియజేయాలని లిఖితపూర్వకంగా తనకు కార్యాలయంలో అందించాలని సూచించారు. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి ఇందిరమ్మ గృహ నిర్మాణాలను చేపట్టే విధంగా తమ సహకారం లబ్ధిదారులకు ఉంటుందని సూచించారు. ప్రభుత్వా నిబంధనల ప్రకారం ఇందిరమ్మ గృహ పథకం నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు తెలియజేశారు. నిబంధనలు ఉల్లంఘచిన ఎడల వారికి డబ్బులు ప్రభుత్వం ఇవ్వదని తప్పకుండా నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు స్థానిక జిపి కార్యదర్శి,  ఇందిరమ్మ గృహ పథకాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -