Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికలకు ఏర్పాట్లు చేసిన పోలింగ్ కేంద్రాల పరిశీలన

ఎన్నికలకు ఏర్పాట్లు చేసిన పోలింగ్ కేంద్రాల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్, రాజరాజేశ్వరి నగర్, నాగపూర్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధం చేసిన పోలింగ్ కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. మండల పంచాయతీ అధికారి సదాశివ తో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే సిద్ధం చేసిన సౌకర్యాలను మరో మారు పరిశీలన చేసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా పోలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సౌందర్య, సంధ్య, రాఘవేందర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -