Tuesday, November 25, 2025
E-PAPER
Homeజిల్లాలుస్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) పోటీ..

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) పోటీ..

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి..
నవతెలంగాణ – కన్నాయిగూడెం

కన్నాయి గూడెం మండలంలోని సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం కోరం చిరంజీవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్వాయి, బుట్టాయిగూడెం, కన్నాయిగూడెం గ్రామపంచాయతీలలో సీపీఐ(ఎం) అభ్యర్థులను పోటీలో నిలపనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోడు భూములకు హక్కు పత్రాలు సాధించడానికి సీపీఐ(ఎం) అభ్యర్థులను మండలంలో పోటీలో నిలుపుతున్నామని, సీపీఐ(ఎం) అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) అభ్యర్థులు కృషి చేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి కృషి చేస్తామని అందుకు అనుగుణంగా పోరాటాల రూపకల్పన చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి దావూద్, రత్నం రాజేందర్, పార్టీ మండల కార్యదర్శి కావిరి సుధాకర్, పాష, మధు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -