నవతెలంగాణ – తుంగతుర్తి
కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణి చేస్తున్న ఇందిరమ్మ చీరెలు,18 సంవత్సరాలు నిండి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని, బి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,పొదుపు సంఘాల్లో లేని మహిళలకు ఇవ్వరా.. వాళ్ళుమహిళలు కారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.గత కెసిఆర్ ప్రభుత్వంలో 18సం,రాలు నిండి తెల్ల రేషన్ కార్డులో పేరున్న ప్రతి సోదరిమణికి బతుకమ్మ చీరెలు అందచేయడం జరిగింది అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు దండుకొని మరోసారి మహిళలను మోసం చేద్దామని చూస్తున్న కార్యక్రమంలో భాగమే ఈ చీరల పంపిణీ కార్యక్రమం అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు రైతు రుణ మాఫీ,రైతుభరోసా, సబ్సిడీ గ్యాస్,ఉచిత కరెంట్, సన్న దాన్యానికి బోనస్ ఇవన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.చీరెల పధకం కూడా అలాగే అసంపూర్తిగా ఉందని అన్నారు.అందుకే మహిళలకు విజ్నప్తి చేస్తున్నాం అసంపూర్తిగా మీకు చీరెలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే విధంగా స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.



