ఇందిరమ్మ చీరలను పంపిణి చేసిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్…
నవతెలంగాణ- కుభీర్
మహిళల అభ్యునతి కి ప్రభుత్వం కృషి చేస్తుందని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన కుభీర్ రైతు వేదికలో చీరాల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతితి గా హాజరై డ్వాక్రా మహిళలకు చీరాలు పంపిణి చేశారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నియోజక వర్గంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఇందిరమ్మ చీరలను పంపిణి చేయడం జరుగుతుంది.
అక్కడి నుంచి ప్రభుత్వ ఉన్నాత పాఠశాలలో నూతనంగా నిర్మించే భవిత కేంద్రనికి 10లక్షల నిధులు, జూనియర్ కళాశాల నిర్మాణానికి 56లక్షలతో నిర్మించే ముడు గదుల కు భూమి పూజ చేశారు. పనులను నాణ్యత తో చేపట్టి విద్యార్థులకు త్వరగా అందించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ, ఆత్మ కమిటీ చెర్మన్ సిద్ధం వేవేకానంద్ మాజీ ఎంపీపీ విఠల్, నగేష్ బీజేపీ మండల అధ్యక్షులు ఏశాల దత్తత్రి ఎంపీడీఓ సాగర్ రెడ్డి తహసీల్దార్ శివరాజ్ ఎస్ ఓ వాణి శ్రీ ఐకేపీ సీసీ లు మహిళలు మండల నాయకులు తదితరులు ఉన్నారు.



