Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగవైకల్యం శరీరానికే.. మనసుకు కాదు

అంగవైకల్యం శరీరానికే.. మనసుకు కాదు

- Advertisement -

అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) యాదయ్య
నవతెలంగాణ – వనపర్తి 

దివ్యాంగులందరిలో అంగవైకల్యం కేవలం శరీరానికే కానీ.. మనసుకు కాదని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యాదయ్య అన్నారు. డిసెంబర్ మూడవ తేదీన నిర్వహించే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము -2025ను పురస్కరించుకొని మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్దుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కే.సుధారాణి అధ్యక్షతన జిల్లాస్థాయి దివ్యాంగుల ఆటల పోటీలను మంగళవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు అడిషనల్ కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) యాదయ్య, డి.ఆర్.డి.ఓ ఉమాదేవి, డిస్టిక్ స్పోర్ట్స్ సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ యాదయ్య మాట్లాడుతూ వికలాంగత్వం శరీరానికే కానీ మనసుకు కాదన్నారు. మీరు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొని విజయం సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయిలో ఆడిస్తామని ప్రకటించారు. వాళ్లకు కావాల్సిన ట్రైనింగ్ కూడా రాష్ట్రస్థాయి నుంచి ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల కమిటీ సభ్యులు, జిల్లా సంక్షేమ శాఖ సీడీపీఓ లు, సూపర్వైజర్లు, స్టాప్ ఐసిపిఎస్ పాల్గొని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -