– హత్యాయత్నం కేసు గా నమోదు
– కోర్ట్ కు సరెండర్
– వెళ్ళడించిన ఎస్ హెచ్ ఓ యయాతి రాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నారం వారి గూడెం కాలనీ గ్రామ రెవెన్యూ పరిధిలోని భూ వివాదంలో సోమవారం పరస్పరం దాడులు చేసుకుని గాయాలకు కారకులైన నిందితులను పోలీస్ లు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం హత్యాయత్నం కేసు గా నమోదు చేసి కోర్ట్ సరెండర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం మంగ గణేష్, వెంకటేశ్వరరావు ల పై కత్తులతో దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు గేదెల విష్ణుమూర్తి,గేదెల సురేష్, గేదెల వినయ్ అలియాస్ విన నాగు లను మంగళవారం అరెస్ట్ చేసి,దమ్మపేట మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా నిందితులను సత్తుపల్లి జైలుకు రిమాండ్ తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కే.అఖిల,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో భూ వివాదం నిందితులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



