నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందంచే చదువు, విలువపై, కళా జాత ప్రదర్శన”నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు,సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందంచే కళాశాలలోని విద్యార్థులకు చదువు విలువ, గొప్పతనంపై అలానే విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవద్దని, బానిసలు కావద్దని,ఆరోగ్యంతో అందమైన భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు.
బాల్య వివాహాలు చేసుకోవద్దని,బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల జరిగే కష్టాలు,అనర్ధాలు, నష్టాల గురించి తమ మాటలు, పాటల ద్వారా చక్కని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమాన్నీ ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ విజయ దేవి మాట్లాడారు విద్యార్థులకు ఇలాంటి ఈ చక్కటి కార్యక్రమాన్ని కళాశాలలో ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి,జిల్లా కలెక్టర్ కు,సాంస్కృతిక సారధి కళాబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెగ్గం శిరీష సంస్కృతిక కళాబృందం, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



