Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పలు గ్రామాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ

పలు గ్రామాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి          
మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆడపడుచులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కోనాపూర్, కోన సముందర్, కమ్మర్ పల్లి గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు ఇంటిఇంటికి తిరుగుతూ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలను ధరించిన పలువురు మహిళలు చీరల నాణ్యత బాగుందని పేర్కొంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు చీరలు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఐకెపి సీసీలు గంగా లలిత, సీసీ అడెల్లి రవి, బాలమణి, నయన, లత, కోనాపూర్ సీఏలు గంగాధర్, గణేష్, విఓఏలు వనజ, విజయ, ప్రియాంక, లక్ష్మి, రోజా, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -