• ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
నవతెలంగాణ -పెద్దవంగర
నేటి డిజిటల్ యుగంలో యువత పఠనాసక్తి పెంచుకొని విజ్ఞాన వంతులుగా ఎదగాలని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండలంలోని ఉప్పెరగూడెం గ్రంథాలయానికి ఎమ్మెల్యే మంగళవారం పుస్తకాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆస్తులు, పదవులు శాశ్వతం కాదని, మనం పెంచుకున్న జ్ఞానమే ఎల్లప్పుడూ మనతో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ బిడ్డలను విద్యార్థి దశ నుంచే గ్రంథాలయాలకు పంపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్య నాయక్, సీనియర్ నాయకులు దుంపల శ్యాం, ఉప్పలయ్య, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
యువత పఠనాసక్తిని పెంచుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



