Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలి..

నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలి..

- Advertisement -

ఫర్టిలైజర్స్ షాప్ లను తనిఖీ చేసిన డిఏఓ
నవతెలంగాణ – మిర్యాలగూడ 

రైతులు నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణ పరిధిలోని రైతు మిత్ర ఫర్టిలైజర్స్, సాయి మహేశ్వర ఫర్టిలైజర్స్, అమర్ సాయి ఫర్టిలైజర్స ఎంబి అక్కయ్య  ఫర్టిలైజర్స్ షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే ప్రతి సారి విక్రయ రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

విత్తనాల ఎమ్మార్పీ ధరలు, నాణ్యత వివరాలు పూర్తిగా పరిశీలించి కొనుగోలు చేయాలని కోరారు. తీసుకున్న రసీదులను పంట కాలం మొత్తం భద్రంగా ఉంచుకోవాలి అని సూచించారు. నాణ్యమైన విత్తనాలు–ఎరువులనే విక్రయించాలని డీలర్లకు సూచించారు. నాణ్యతలో లోపాలు ఉన్నట్లయితే సంబంధిత డీలర్లపై శాఖ తరఫున కఠిన చర్యలు  తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో చలి తీవ్రంగా ఉన్నందున రైతులు విత్తనాలు నాటే కార్యక్రమాన్ని ఒక వారం రోజులపాటు వాయిదా వేసుకోవడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఏ డి ఎస్ సైదా నాయక్, డీలర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -