మలయాళ సినిమాలో మొట్ట మొదటి పూర్తి నిడివి గల డబ్ల్యుడబ్ల్యుఇ జోనర్ యాక్షన్-కామెడీ చిత్రం ‘చఠా పచా- రింగ్ ఆఫ్ రౌడీస్’. ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు నిర్మాణ-పంపిణీ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా రిలీజ్ చేయనుంది. జనవరి 2026లో విడుదల కానున్న ఈ చిత్రం కేరళలో దుల్కర్ సల్మాన్ నేతత్వంలోని వేఫేరర్ ఫిల్మ్స్ రిలీజ్ చేయనుంది.
ఈ చిత్రానికి నూతన దర్శకుడు అద్వైత్ నాయర్ దర్శకత్వం వహించగా, రీల్ వరల్డ్ ఎంటర్‌టైన ్‌మెంట్ నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థను ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లెన్స్‌మన్ గ్రూప్ కలిసి ఏర్పాటు చేశాయి. రమేష్, రితేష్ రామకష్ణన్, షిహాన్ షౌక్కత్, ఎస్. జార్జ్ మరియు సునీల్ సింగ్ ఈ వెంచర్‌లో కీలక భాగస్వాములు.
అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, ఇషాన్ షౌక్కత్ (”మార్కో” ఫేమ్), విశాఖ్ నాయర్, పూజా మోహన్‌దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
డబ్ల్యు డబ్ల్యుఇ రెజ్లింగ్, ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే పాత్రల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం భారీ రెజ్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇంతకు ముందు సోషల్ మీడియాలో తుఫాను సష్టించిన ఈ టీజర్ ప్రత్యేకమైన పాత్ర గెటప్‌లు, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను చూపించింది.
ఫోర్ట్ కొచ్చిలోని డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప యాక్షన్-కామెడీ ఎక్స్ పీరియన్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే భారీ ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం టీజర్, పోస్టర్లు, రెగ్యులర్ అప్‌డేట్‌లతో అంచనాలను పెంచుతూనే ఉంది. పాన్-ఇండియా విడుదలగా, ఈ చిత్రం ఉత్తర భారత థియేట్రికల్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ తమిళనాడు, కర్ణాటకలో రిలీజ్ చేస్తుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషలలో 115 కంటే ఎక్కువ దేశాలలో విడుదల అవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో మైత్రి ద్వారా రిలీజ్
- Advertisement -
- Advertisement -



