Wednesday, November 26, 2025
E-PAPER
Homeసినిమానమ్మకాన్ని పెంచిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఆడిషన్‌

నమ్మకాన్ని పెంచిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆడిషన్‌

- Advertisement -

”జిగ్రీస్‌’ సినిమా నటుడిగా నాలో సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది అని అంటున్నారు కష్ణ బూరుగుల. ఈయన హీరోగా నటించిన ఈ చిత్రం ఈనెల 14న రిలీజై మంచి స్పందను రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
నాన్న బిజినెస్‌ మ్యాన్‌. అమ్మ గహిణి. నాన్నకు కూడా సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. అయితే ఆయనకు వీలు కాలేదు. నేను కూడా చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఇష్టంతో ‘అష్టాచమ్మా’ చిత్రంలో హీరో చిన్నప్పటి పాత్రలో నటించాను. కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో యాక్ట్‌ చేశాను. మహేంద్ర చక్రవర్తి దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్న తర్వాత, ఛాన్స్‌ల కోసం ప్రయత్నించాను.
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం దర్శకుడు రాజమౌళి ఆడిషన్స్‌ చేస్తున్నారని తెలిసింది. అయితే చిన్న యాక్సిడెంట్‌ కారణంగా నాకు చేయి ఫ్రాక్చర్‌ అయ్యింది. ఫ్రాక్చర్‌తో ఉన్నప్పటికీ ఆడిషన్‌లో పాల్గొన్నాను. అది నచ్చటంతో ఆ మూవీలో ఓ చిన్న రోల్‌ ఇచ్చారు. అయితే అది ఎడిటింగ్‌లో పోయింది. కానీ ఆ మూవీకి చేసిన ఆడిషన్‌.. ఆ సమయంలో నా సిట్యువేషన్‌.. ఇవన్నీ నాలో తెలియని కాన్ఫిడెన్స్‌ని పెంచి ఎనర్జీనిచ్చింది. దీంతో 100కి పైగా ఆడిషన్‌ వీడియోస్‌ షూట్‌ చేసి యూ ట్యూబ్‌లో అప్‌ లోడ్‌ చేశాను.
రవిబాబు డైరెక్ట్‌ చేసిన ‘క్రష్‌’ మూవీ హీరోగా నాకు డెబ్యూ మూవీ. తర్వాత ‘మానాన్న నక్సలైట్‌’ సినిమాలో నటించాను. హరీష్‌ శంకర్‌ షో రన్నర్‌గా చేసిన ‘ఏటీఎం’ వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేశాను. కొరటాల శివ సమర్పణలో వచ్చిన ‘కష్ణమ్మ’ చిత్రంలో నటించాను. ఇవన్నీ నాకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చినవే.
‘జిగ్రీస్‌’ విషయానికి వస్తే.. నాది రగ్డ్‌, చిచోరే పాత్ర. నా రియల్‌ లైఫ్‌కు పూర్తి భిన్నమైన పాత్ర. స్క్రిప్ట్‌ తొలిసారి చదవగానే అందులో ఉన్న కొత్తదనం నాకు కనెక్ట్‌ అయ్యింది. పాత్రకు తగ్గట్టు లుక్‌ మార్చుకున్నాను. అందుకే నా పాత్ర చూసి, అందరూ ఫోన్‌ చేసి అద్భుతంగా చేశానని అప్రిషియేట్‌ చేస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ వంగా కూడా సినిమా చూసి చాలా బాగా చేశానని అప్రిషియేట్‌ చేశారు. ఇంత రెస్పాన్స్‌ వస్తుందని నేను అనుకోలేదు. సినిమా చూసిన నా ఫ్రెండ్స్‌తో పాటు చాలా మంది యూత్‌ నా పాత్రకు కనెక్ట్‌ అయ్యారు. ఇది యాక్టర్‌గా నాకు ఉత్సాహాన్నిచ్చింది. త్వరలోనే సినిమాను స్టార్ట్‌ చేస్తాను. మంచి చిత్రాలు, పాత్రలతో అలరించాలన్నది నా ఆశయం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -