Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంజుబీన్‌ గార్గ్‌ది హత్యే

జుబీన్‌ గార్గ్‌ది హత్యే

- Advertisement -

అసెంబ్లీలో అసోం సీఎం
డిస్‌పూర్‌ :
ప్రముఖ అసోం గాయకుడు జుబీన్‌ గార్గ్‌ది హత్యే అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. జుబీన్‌ గార్గ్‌ మరణంపై అసోం అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రాథమిక దర్యాప్తు తరువాత అసోం పోలీసులు గార్గ్‌ది హత్యే అని తేల్చారని హిమంత బిస్వా శర్మ తెలిపారు. కాబట్టి గార్గ్‌ మరణించిన మూడు రోజుల్లోనే కేసును బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 103ను చేర్చారని చెప్పారు. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ ఆధ్వర్యంలోని సీఐటీ ఇప్పటి వరకూ ఏడుగుర్ని అరెస్టు చేసిందని, 252 మంది సాక్షులను విచారించిందని, 20 ఆధారాలను స్వాధీనం చేసుకుందని చెప్పారు. నిందితుల్లో ఒకరు గార్గ్‌ను చంపగా, మరికొందరు అతనికి సాయం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం తీవ్రమైన చార్జిషీట్‌ను దాఖలు చేస్తుందని చెప్పారు. సెప్టెంబరు 19న సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతూ జుబీన్‌ గార్గ్‌ మరణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -