Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంసీఎం మార్పు గందరగోళానికి తెరదింపాలి

సీఎం మార్పు గందరగోళానికి తెరదింపాలి

- Advertisement -

కాంగ్రెస్‌ హైకమాండ్‌ జోక్యం చేసుకోవాలి : కర్నాటక సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు :
కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు గందరగోళానికి ముగింపు పలికే విధంగా కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఒక నిర్ణయం తీసుకోవాలని సిద్ధరామయ్య మంగళవారం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మార్పు విషయంపై హైకమాండ్‌ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన పునరుద్ఘాటించారు. శాసన సభ్యులు పార్టీ నాయకత్వాన్ని కలవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి స్వేచ్ఛగా ఉన్నారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల ఢిల్లీ టూర్‌ గురించి విలేకరులు మంగళవారం అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య సమాధానం ఇస్తూ ‘వారిని వెళ్లనివ్వండి. ఎమ్మెల్యేలకు ఆ స్వేచ్ఛ ఉంది. వారు ఏ అభి ప్రాయం పంచుకుంటారో చూద్దాం. చివరిగా హైకమాండ్‌ నిర్ణయం తీసుకోవాలి. హైకమాండ్‌ చెప్పిన దానికి మేం కట్టుబడి ఉంటాం’ అని తెలిపారు. అలాగే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అడిగిన ప్రశ్నకు ‘హైకమాండ్‌ చెప్పినప్పుడే అది జరుగుతుంది’ అని సమాధానం ఇచ్చారు. అలాగే, రాహుల్‌గాంధీని కలిసే ఆలోచన ప్రస్తు తానికి లేదని కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలి పారు. కాగా, మరోవైపు కొన్ని రోజులుగానే బెంగళూరు లోనే ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో ఖర్గేతో పాటు శివకుమార్‌ విమానాశ్రయానికి వెళ్లారు.

కాగా, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఐదేండ్ల పదవీకాలంలో సగంకాలం పూర్తికావడంతో ముఖ్యమంత్రి మార్పుపై తీవ్రంగా ఊహాగానాలు సాగుతున్నాయి. 2023లో సిద్ధరామయ్య పదవీస్వీకారం చేసిన సమయంలోనే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో రెండున్నరేండ్ల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది. దాని ప్రకారం ఈ నెల 20తో ఆ రెండున్నరేండ్ల గడువు ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -