Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంలేబర్‌ కోడ్‌లపై రాష్ట్రాల విముఖత

లేబర్‌ కోడ్‌లపై రాష్ట్రాల విముఖత

- Advertisement -

బెంగాల్‌, కేరళ, తమిళనాడు ప్రభుత్వాల అభ్యంతరాలు
సామాజిక భద్రతా కోడ్‌పై ఆందోళన
న్యూఢిల్లీ :
కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ముసాయిదా నిబంధనల ప్రచురణపై పశ్చిమ బెంగాల్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు లేబర్‌ కోడ్‌లపై కేరళ, తమిళనాడు అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఇవి కార్మికుల సంక్షేమాన్ని, హక్కులను బలహీనపరుస్తాయని ఆ రాష్ట్రాలు అంటున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రానికి, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు మధ్య ఘర్షణ తప్పేలా లేదు.

రీ-నోటిఫైకి కేంద్రం నిర్ణయం
ఐదు సంవత్సరాల క్రితం పార్లమెంట్‌ ఆమోదించిన లేబర్‌ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చినప్ప టికీ వాటికి సంబంధించిన తుది నిబంధనలను ఇంకా నోటిఫై చేయలేదు. ముసాయిదా నిబంధనలను తిరిగి నోటిఫై చేసి, కార్మిక సంఘాలు, సంబంధిత పక్షాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయిం చింది. ఎందుకంటే వీటిని 2020లో నోటిఫై చేశారు. ఇప్పటికి ఐదు సంవత్సరాలు గడిచినందున తిరిగి నోటిఫై చేయా లని కేంద్రం అనుకుంటోంది. వచ్చే సంవత్సరం మార్చి నాటికి నిబంధనలను రూపొందించే అవకాశం ఉంది.

బెంగాల్‌ వ్యతిరేకత
కార్మికులకు సంబంధించిన అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్రాలు కూడా ఈ నాలుగు చట్టాలపై సంప్రదింపుల కోసం తమ ముసాయిదా నిబంధనలను ప్రచురించాల్సి ఉంటుంది. వీటి గురించి కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా కోరుతున్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అనేక రాష్ట్రాలు ఇప్పటికే ముసాయిదా నిబంధనలను నోటిఫై చేశాయి. వాటిని తిరిగి నోటిఫై చేయాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది ఆయా రాష్ట్రాలే. బెంగాల్‌ విముఖత రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే లేబర్‌ కోడ్‌ల ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ రితబ్రత బెనర్జీ తెలిపారు.

కేరళ, తమిళనాడు అభ్యంతరాలు
మూడు కార్మిక చట్టాలకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను తమిళనాడు నోటిఫై చేసింది. సామాజిక భద్రతా కోడ్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కోడ్‌ కింద తమ కార్మిక సంక్షేమ పథకాలను కొనసాగిం చడం కష్టమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నిబంధ నలను నోటిఫై చేస్తే ప్రభుత్వ ఆందోళనలను పరిశీలి స్తానని కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ తమిళనాడు స్పందిం చలేదు. కార్మిక హక్కులను బలహీనపరిచే ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోబోమని కేరళ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

నేడు కేంద్ర కార్మిక సంఘాల నిరసన
కేంద్ర కార్మిక సంఘాలు నూతన లేబర్‌ కోడ్‌లను కార్మికులకు వ్యతిరేకమైనవిగా అభివర్ణించాయి. అవి బుధవారం నిరసన ప్రదర్శనలకు సమాయత్తమవుతున్నాయి. ఇదిలావుండగా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇండియన్‌ లేబర్‌ కాంగ్రెస్‌ను కానీ, కార్మిక మంత్రుల సదస్సును కానీ ఏర్పాటు చేయవచ్చు. లేనిపక్షంలో ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అప్పుడు బంతి కోర్టులో ఉంటుంది.

కోడ్‌లతో ఉపాధి భద్రత నిర్వీర్యం కేరళ సీఎం పినరయి విజయన్‌
వినాశకర లేబర్‌ కోడ్‌లపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైనా..కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టు చేశారు. ఏకపక్షంగా కేంద్రం తీసుకొచ్చిన ఈ కోడ్‌ల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో అభ్యం తరాలు వ్యక్తం చేశాయని, 2015 తర్వాత మళ్లీ అఖిల భారత కార్మిక మహాసభకు పిలుపునిచ్చి కోడ్‌ల పట్ల వ్యతిరేకత తెలిపారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాల నుంచి సమ్మతి తీసుకోకుండానే..కనీస చర్చలు, సం ప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్‌ కోడ్‌లను బలవంతంగా అమల్లోకి తీసుకొ చ్చిందన్నారు. కార్మికుల ఉపాధి భద్రతను, ఉమ్మడి వేతన బేరసారాల హక్కును ఈ కోడ్‌లు నిర్వీర్యం చేస్తున్నాయని విజయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దుర్మార్గమైన ఈ లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపడు తున్న ఆందోళనలకు ప్రజానీకం మొత్తం తమ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -