కాషాయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోడీ
లక్నో : అయోధ్యలోని రామాల యంలో ప్రధాని మోడీ మంగళవారం కాషాయ పతాకం – ధర్మ ధ్వజాన్ని ఎగురవేశారు. రామాలయ నిర్మాణం పూర్తయినందుకు గుర్తుగా ఈ పతాకా విష్కరణ జరిగింది. పది అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు వున్న త్రిభుజాకారపు కాషాయ పతాకాన్ని మోడీ ఆవిష్కరించారు. ఈ జెండాపై సూర్యుడు, ఓం, కోవిదార చెట్టు చిత్రాలు వున్నాయి. ఈ ధ్వజారోహణ కార్య క్రమంలో ప్రధాని మోడీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు పాల్గొన్నారు. అనంతరం మోడీ అక్కడున్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈనాడు భారతదేశ సాంస్కృతిక చైతన్యంలో మరో మలుపును ఈ నగరం వీక్షిస్తోంది. రామ జన్మభూమి ఆలయ శిఖరానికి జరిపే ఈ కీలకమైన ధ్వజారోహణ ఘట్టం విశిష్టమైనది, ప్రత్యేకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. రామరాజ్యం విలువలు కాలాతీతమైనవని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని వేలాదిమంది భక్తులు ఉదయం నుండే అయోధ్యకు పోటెత్తారు. జై శ్రీరామ్ నినాదాలు నగరమంతా ప్రతిధ్వనించాయి. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 7వేలమంది బలగాలను నగరంలో మోహరించారు.
అయోధ్య రామాలయంలో ధ్వజారోహణం
- Advertisement -
- Advertisement -



