Wednesday, November 26, 2025
E-PAPER

హలో…హలో !

- Advertisement -

ద్వైపాక్షిక సహకారంపై ట్రంప్‌, జిన్‌పింగ్‌ చర్చలు
బీజింగ్‌ :
చైనా, అమెరికా అధ్యక్షులు జిన్‌పింగ్‌, డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య సోమవారం టెలిఫోన్‌ సంభాషణ జరిగింది. ద్వైపాక్షిక సహ కారం, తైవాన్‌ వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయని చైనా అధికార వార్తా సంస్థ సిన్హువా తెలియజేసింది. దక్షిణ కొరియాలో గత నెలలో జరిగిన ద్వైపాక్షిక సమా వేశం తర్వాత ఇరు దేశాల మధ్య సంబం ధాలు ఊపం దుకున్నాయని జిన్‌పింగ్‌ చెప్పారు. తైవాన్‌ తిరిగి చైనాలో కలవడం అనేది యుద్ధా నంతర అంతర్జాతీయ క్రమంలో ముఖ్యమైన భాగమని ఆయన అన్నారు. యుద్ధ సమయంలో ఫాసిజానికి, సైనికవాదానికి (మిలిటరిజం) వ్యతిరేకంగా చైనా, అమెరికా దేశాలు కలిసి పోరాడాయని గుర్తు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయాన్ని రెండు దేశాలు కలసి కాపాడుకోవాలని సూచించారు.కాగా తైవాన్‌ సార్వభౌమత్వంపై అమెరికా ఇంకా ఎలాంటి వైఖరిని తీసుకోలేదు. అయితే స్వయం పాలిత దీవిని స్వాధీనం చేసుకో వడానికి బలప్రయోగం జరపడాన్ని అది వ్యతిరేకిస్తోంది. తైవాన్‌ జలసం ధిలో ఘర్షణ తలెత్తిన పక్షంలో అమెరికా దళాలను తరలించే విషయంలో కూడా ఆయన వ్యూహాత్మక సందిగ్ధతను కొనసాగిస్తున్నారు. మరోవైపు రక్షణ వ్యయాన్ని పెంచాలంటూ తైవాన్‌పై ట్రంప్‌ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అమెరికా, చైనా మధ్య గత నెలలో వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య టెలిఫోన్‌ సంభాషణ జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కొన్ని చైనా వస్తువులపై అమెరికా సుంకాలను తగ్గిం చింది. అదే సమయంలో రేర్‌ ఎర్త్‌ ఎగుమతులపై విధించిన ఆంక్షలను చైనా తొలగిం చింది. ‘నేను ఏప్రిల్‌లో చైనా వెళుతున్నాను. ఆ తర్వాత జిన్‌పింగ్‌ అమెరికా వస్తారు. అది ఫ్లోరిడా కావచ్చు…పామ్‌ బీచ్‌ కావచ్చు లేదా వాషింగ్టన్‌ డీసీ కావచ్చు’ అని ట్రంప్‌ ఇదివరకే చెప్పారు. జిన్‌పింగ్‌తో ఇటీవల తాను జరిపి న చర్చలు ‘మంచి విజయాన్ని’ అందించాయని కూడా ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -