రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎస్కేఎం లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని రైతులకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 9న ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై ఎస్కేఎం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిం ది. హామీ ఇచ్చిన పంట సేకరణ, సమగ్ర రుణమాఫీ, కార్మిక కోడ్‌ల రద్దు, విద్యుత్ బిల్లు 2025, విత్తన బిల్లు 2025, జాతీయ సహకార విధానం, శ్రామిక ప్రజలను బాధించే ఎఫ్టీఎలు, ఎంఎస్‌పీ ఏ సి2ం50 కోసం చట్టాన్ని రూపొందించడం వంటి డిమాండ్లను ఎస్కేఎం రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రధాన డిమాండ్లు ఇవే….
- ఎంఎస్‌పీ సి2ం50తో కూడిన సేకరణ హామీ ఇస్తూ వెంటనే చట్టాన్ని రూపొందించాలి. (సేకరణ వ్యవస్థ లేకపోవడంతో రైతులు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఎ2ంఎఫ్‌ఎల్‌ం50% ఆధారంగా ఎంఎస్‌పీలో 30 శాతం కంటే తక్కువ ధరలకు పంటలను విక్రయించాల్సి వస్తుంది)
- రైతులు, వ్యవసాయ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం సమగ్ర రుణమాఫీ పథకాన్ని ప్రకటించాలి. ఎంఎఫ్‌ఐలు, వడ్డీ రేట్లను నియంత్రించడానికి, రుణగ్రహీతలపై వేధింపులను అంతం చేయడానికి చట్టం చేయాలి. ఎరువుల కొరత, బ్లాక్ మార్కెటింగ్ ఆపాలి. ప్రకృతి వైపరీత్యాల బాధితులకు పరిహారం లేకపోవడం, అడవి జంతువుల ముప్పు నుంచి ప్రాణాలకు, పంటలకు రక్షణ కల్పించాలి.
3.విద్యుత్, పీఎస్‌యూల ప్రయివేటీకరణ ఆపాలి. ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలి. విద్యుత్ బిల్లు 2025 రద్దు చేయాలి. అన్ని గృహాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలి.
4.దేశంపై 50 శాతం యూఎస్ సుంకం విధించడాన్ని దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్టుగా పరిగణించాలి. కఠినమైన పరస్పర చర్యలు తీసుకోవాలి. పత్తి, పాడి పరిశ్రమ రంగాలలో ఎఫ్‌టీఎ ఆపాలి. పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి. రైతులు, కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే ఎఫ్‌టీఎలు చేయొద్దు. ఇండో-యూకే ఎఫ్‌టీఎ సీఈటీఎని రద్దు చేయాలి. ముసాయిదా విత్తన బిల్లు 2025ని ఉప సంహరించుకోవాలి. - నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలి. కనీస వేతన హక్కును పరిరక్షించాలి.
- అన్ని తీవ్రమైన వరదలు, ప్రకృతి వైపరీత్యాలను జాతీయ విపత్తులుగా ప్రకటించాలి. వాస్తవ నష్టాల ఆధారంగా పూర్తి పరిహారాన్ని నిర్ధారించడానికి భౌతిక ధృవీకరణను తప్పనిసరి చేయాలి. అన్ని విపత్తు ప్రభావిత రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల పరిహారం, పంజాబ్‌కు రూ. 25,000 కోట్లు విడుదల చేయాలి. కౌలుదారు రైతులు, వ్యవసాయ కార్మికుల పరిహారం హక్కును పరిరక్షించాలి.
- 200 రోజుల పని, రూ.700 దినసరి వేతనం హామీ ఇవ్వాలి. రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి ఉపాధి హామీని వ్యవసాయం, పాడి పరిశ్రమతో అనుసంధానించాలి. నియామకాలపై నిషేధాన్ని వెంటనే రద్దు చేయాలి. క్యాజువలైజేషన్, అవుట్‌సోర్సింగ్, శాశ్వత ఉద్యోగాల కాంట్రాక్టైజేషన్‌ను నిషేధించాలి. ప్రభుత్వ, ప్రభుత్వ రంగాల్లో ఖాళీగా ఉన్న 65 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయాలి. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనారిటీలకు సామాజిక రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాలి.
- బుల్డోజర్ రాజ్‌ను నిషేధించాలి. వ్యవసాయ భూమిని విచక్షణారహితంగా సేకరించడం నిషేధించాలి. పునరావాసం, పునరావాస హక్కును పరిరక్షించాలి. ఎల్‌ఎఆర్‌ఆర్ చట్టం 2013 అన్ని ఉల్లంఘనలకు పరిహారం ఇవ్వాలి.
ఈ డిమాండ్ల సాధన కోసం రైతులు, కార్మికులను క్షేత్రస్థాయి వరకు ఐక్యతను పెంచాలని పిలుపు ఇచ్చింది.



