Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్రాజీవ్ యువ వికాస పథకం అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి…

రాజీవ్ యువ వికాస పథకం అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకం అమలుకు పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి అన్నారు.శనివారం కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ యువ  వికాస పథకం అమలు తీరుతెన్నులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రాజీవ్ యువ వికాస పథకం కింద లబ్ధిదారుల నుండి 39వేల దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. జూన్ రెండో తేదీ నుండి 9వ తేదీ వరకు మంజూరు ధ్రువ పత్రాలు లబ్ధిదారులకు అందజేయనున్నందున లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టేందుకు సంబంధిత యూనిట్లపై అవగాహన పొందాలన్నారు. ఆయా ప్రాంతంలో యూనిట్ నెలకొల్పడంలో మార్కెటింగ్ ఆవశ్యకత ను గుర్తించాలన్నారు. యూనిట్ స్థాపనలో సామాగ్రికి, ఏర్పాటుకు అయ్యే ఖర్చులను అంచనా వేయాలన్నారు. నెలకొల్పే ప్రతి యూనిట్ ఆయా ప్రాంతంలో డిమాండ్ కలిగి ఉండటంతో పాటు లబ్ధిదారుని జీవన ప్రగతి పెంచే విధంగా ఉండాలన్నారు. రాజీవ్ యువ వికాస పథకంతో ప్రతి నిరుపేద లబ్ధిదారుడు బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, బీసీ వెల్ఫేర్ యాదయ్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ మోతిలాల్, చేనేత జౌళి శాఖ ఏడి శ్రీనివాసరావు ఉద్యాన శాఖ అధికారి సుభాషిని ఫిషరీస్ ఏడి రాజారాం వ్యవసాయ శాఖ ఏడి నీలిమ, లీడ్ బ్యాంకు మేనేజర్ శివరామకృష్ణ ఇండస్ట్రీస్ ఎడి విజయ్ కుమార్ రెడ్డి డిఎంహెచ్వో డాక్టర్ మనోహర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -