Sunday, May 18, 2025
Homeతెలంగాణ రౌండప్సోమవారం మనసైతం దేశం కోసం ర్యాలీ..

సోమవారం మనసైతం దేశం కోసం ర్యాలీ..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్ పీచమనిచిన భారత సైనికులకు సంఘీభావంగా సోమవారం మనంసైతం దేశం కోసం ర్యాలీ నిరహిస్తున్నట్లు సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ జిల్లా కన్వీనర్, సీనియర్ న్యాయవాది జి. వి.కృపాకర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ హల్ లో న్యాయవాదులు జగన్మోహన్ గౌడ్,ఆశ నారాయణ, మహమ్మద్ ఖాసీమ్, పడిగల వెంకటేశ్, ఎర్రం విగ్నేష్, బిట్ల రవి,పిల్లి శ్రీకాంత్, ప్రకాష్, నారాయణ లతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. పాకిస్థాన్ టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ,భారతపై ఉసిగొల్పుతోందని ఆయన అన్నారు. భారత పార్లమెంట్ పై దాడి,ముంబై మారణహోమం, ఉరి,పుల్వామా,కార్గిల్ చొరబాటు అనే దొంగచాటు మారణహోమాలకు కర్త,కర్మ,క్రియ గా నిలిచిందని ఆయన ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని పహాల్గాం లో హిందువులను ఏరికోరి టెర్రరిస్టులు హత్య చేసిన వైనం మన కళ్లెదుటే కనపడిందని అన్నారు. పహాల్గాం ఘోరకలికి ప్రతీకారంగా భారత సైనికులు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన నేపథ్యంలో వచ్చే సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు నిజామాబాద్ నగరంలోని ఛత్రపతి శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు భారత సైనికులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పౌర సమాజ ప్రతినిధులు, న్యాయవాదులు, డాక్టర్లు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి నాయకత్వంలోని ప్రభుత్వానికి మరింత బలాన్ని,ఉత్తేజాన్ని అందించి,సైనికులకు బాసటగా నిలవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. భద్రత బలగాలకు మరింత నైతికస్థర్యం ఇవ్వాల్సిన గురుతర బాధ్యత గుర్తేరుగుతు మనంసైతం దేశం కోసం ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నదని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -