రాజ్యాంగ దినోత్సవ వేళ ప్రజలకు మోడీ బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: పౌరుల రాజ్యాంగ విధులే బలమైన ప్రజాస్వామ్యానికి పునాదులని ప్రధాని మోడీ అన్నారు. ఈ రాజ్యాంగ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని దేశ పౌరులకు ఆయన పిలుపు నిచ్చారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు సందేశమిస్తూ ప్రధాని మోడీ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఓటుహక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. బాధ్యతలను నిర్వర్తించే వైఖరి నుంచే హక్కుల ప్రవాహం జరుగుతుందని మహాత్మా గాంధీ విశ్వసించారని తెలిపారు. ప్రజలంతా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తేనే సామాజిక, ఆర్థిక వికాసానికి పునాదులు పడతాయని భారత జాతిపిత చెప్పేవారని గుర్తుచేశారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేద్కర్ వంటి ఎంతోమంది మహానుభావులు భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారని మోడీ కొనియాడారు.
రాజ్యాంగ విధులే ప్రజాస్వామ్యానికి పునాదులు
- Advertisement -
- Advertisement -



